న్యూఢిల్లీ : కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ (కెబిఎల్) వ్యయాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌ను నిర్వహించాలని కిర్లోస్కర్ ఇండిస్టీస్ లిమిటెడ్ (కెఐఎల్) జనరల్ బాడీ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 21న జరిగిన సమావేశంలో దీనిపై ప్రధాన చర్చకు వచ్చింది. కెబిఎల్ న్యాయం, నిపుణుల ఫీజులు, కన్సల్టెన్సీల కోసం రూ.274 కోట్లు వ్యయం చేసినట్లు ఇటీవల రిపోర్టులు రావడంతో కెఐఎల్ ఈ నిర్ణయం తీసుకుందని ఆ సంస్థ రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. కెబిఎల్‌లో కెఐఎల్‌కు 23.91 శాతం వాటా ఉంది.










