ఎన్‌టిఆర్ : స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ... నందిగామ మున్సిపల్ ఆఫీస్ బయట మున్సిపల్ వర్కర్ సీనియర్ అధ్యక్షులు సలికేట్ నరేష్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కే.గోపాల్ మాట్లాడుతూ ... కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులన్నిటినీ కాలరాస్తున్నారని అన్నారు. 44 చట్టాల్ని నాలుగు కోడ్ లుగా మార్చేశారని చెప్పారు. కనీస వేతనాలు అడిగే హక్కు లేకుండా చేస్తున్నారని అన్నారు. సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సైదా, మాణిక్యం, పిచ్చియ, ప్రసాదు, నాగరాజు, బేబీ, రైతు కార్మికులు, పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.










