Dec 15,2022 21:22

న్యూఢిల్లీ : మలేషియాలో మహిళల వైద్యం, సంతాన సేవలు అందించే ఫస్ట్‌లైన్‌ ఫార్యాస్యూటికల్స్‌ ఎస్‌డిఎన్‌ను భారత్‌ సీరమ్స్‌ అండ్‌ వాక్సినెస్‌ లిమిటెడ్‌ (బిఎస్‌వి) స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. బిఎస్‌వికి చెందిన జెనోమిక్స్‌ ఎస్‌డిఎన్‌ను కూడా సొంతం చేసుకున్నట్లు పేర్కొంది. ఫస్ట్‌లైన్‌ ఫార్మాను 2007లో ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్‌ కోసం, మెడికల్‌ పరికరాలను సరఫరా చేయడానికి జెనోమిక్స్‌ను 2016లో ఏర్పాటు చేసింది. కాగా.. వీటిని ఎంత మొత్తానికి స్వాధీనం చేసుకున్నది బిఎస్‌వి వెల్లడించలేదు.