బెంగుళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బ్యాటర్ విరాట్ కోహ్లీ జరిమానాకు గురయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు బిసిసిఐ అతనిపై జరిమానా విధించింది. కోహ్లి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత వేస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 లెవల్ వన్ నేరం కింద కోహ్లీకి మ్యాచ్ ఫీజులో కోత విధించారు. ఎందుకు కోహ్లీకి ఫైన్ వేశారన్న విషయం స్పష్టంగా తెలియదు. కానీ సీఎస్కే బ్యాటర్ శివం దూబే ఔటైన తర్వాత కోహ్లీ చాలా వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ ఘటన పట్ల బిసిసిఐ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దూబే తన ఇన్నింగ్స్‌లో కేవలం 26 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో ఆర్సీబి ఓడిపోయింది.










