Jan 12,2023 15:16

ప్రజాశక్తి-రాజంపేట (అన్నమయ్యజిల్లా) : రాజంపేట సబ్‌ కలెక్టర్‌గా ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ ఐఏఎస్‌ గురువారం ఉదయం భాద్యతలు స్వీకరించారు. ఆర్డీఓ డి.కోదండరామిరెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. రాజంపేట తహశీల్దార్‌ పరిధిలోని భూవివాదాలకు సంబంధించి ప్రభుత్వం కోదండరామిరెడ్డిని బదిలీ చేసింది. మరికొంత మంది వీఆర్‌ఓలను సస్పెండ్‌ చేసింది. ఈ క్రమంలో స్థానిక తహశీల్దార్‌ కూడా సెలవుపై వెళ్లిపోయారు. ఇంతకు ముందు ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ చిత్తూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు.