Dec 29,2020 22:32

సమీక్షిస్తున్న సబ్‌ కలెక్టర్‌ ధనుంజరు

జలుమూరు : మండలంలోని ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని టెక్కలి సబ్‌ కలెక్టర్‌ గనూర్‌ సూరజ్‌ ధనుంజరు ఆదేశించారు. తహశీల్దార్‌ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జిలు, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో మంగళవారం సమీక్షించారు. రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి వాటి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేయాలన్నారు. అర్హులందరికీ వచ్చే నెల 7 వరకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఈశ్వరరావు, ఎఒ కె.సురేష్‌, డిటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పోలాకి : ధాన్యం కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని పిపిసి కేంద్రాల ప్రత్యేకాధికారి నగేష్‌ సూచించారు. మంగళవారం వెలుగు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహణకు నిశితంగా పరిశీలించారు. కొలతల్లో, తూనికల్లో తప్పులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఎ.సింహాచలం, డిటి శ్రీనివాసరావు, ఎపిఎం రాజారావు, సిబ్బంది పాల్గొన్నారు.