Oct 24,2020 23:06

చైతన్య సింధును అభినందిస్తున్న సబ్‌కలెక్టర్‌

ప్రజాశక్తి-తెనాలి : నీట్‌ ర్యాంకర్‌ గుత్తి చైతన్య సింధును సబ్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ అభినందించారు. ఏపీఎంసెట్‌లో మొదటి ర్యాంకు, నీట్‌లో ఆల్‌ ఇండియా స్థాయిలో 6వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు కైవశం చేసుకున్న చైతన్య సింధును బీసీ సంక్షేమం సంఘం ఆధ్యర్యంలో స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అభినందించారు. చైతన్యసింధు తల్లిదండ్రులు డాక్టర్‌ జి.కోటేశ్వరప్రసాద్‌, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు. డాక్టర్‌ జె.సుధారాణి, సంఘ నాయకులు పాల్గొన్నారు.