Jul 27,2023 22:01

హైదరాబాద్‌ : ప్రముఖ ఎరువుల ఉత్పత్తుల కంపెనీ కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లాభాల్లో తగ్గుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో నికర లాభాలు ఒక్క శాతం తగ్గి రూ.494 కోట్లుగా చోటు చేసుకున్నాయి. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ 0.6 శాతం తగ్గి రూ.5,693 కోట్లుగా నమోదయ్యింది. కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ దేశంలోనే అతిపెద్ద ఫాస్పేట్‌ ఫెర్టిలైజర్‌ కంపెనీగా ఉంది.