మెక్సికో సిటీ: ఫిఫా 2027 మహిళల ప్రపంచకప్ ఆతిథ్యానికి అమెరికా, మెక్సికో బిడ్స్ దాఖలు చేయనున్నట్లు ఆ దేశాల ఫుట్‌బాల్ సమాఖ్యలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఈమేరకు అమెరికా ఫుట్‌బాల్ సమాఖ్య(యుఎస్‌ఎస్‌ఎఫ్), మెక్సికన్ కౌంటర్ పార్ట్(ఎఫ్‌ఎంఎఫ్) తమ బిడ్స్‌ను దాఖలు చేయనున్న విషయాన్ని వెల్లడించాయి. బిడ్స్ దాఖలు చేయడానికి ఏప్రిల్ 19 చివరిరోజు కావడంతో ఆ రెండుదేశాల ఫుట్‌బాల్ సమాఖ్యలు బిడ్‌లు దాఖలు చేయనున్నట్లు తెలిపాయి. అమెరికా 1999లో, మెక్సికో 2003లో ఫిఫా మహిళల ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చాయి. ఇక ఇక అమెరికా మహిళలజట్టు నాలుగుసార్లు మహిళల ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లి రెండుసార్లు టైటిల్ విజేతగా నిలిచింది. 2023 ఫిఫా మహిళల ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఇక 2026 పురుషుల ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు మెక్సికో, అమెరికా, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.










