ఇంటర్నెట్‌డెస్క్ : మహిళలు మెనోపాజ్ దశలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటారు. ఈ సమస్యల్ని ఎదుర్కోలేక చాలామంది మహిళలు మానసికంగా కుంగిపోతారు. అయితే మెనోపాజ్ సమస్యల్ని అధిగమించడానికి వైద్య నిపుణులు కొన్ని సూచనలిస్తున్నారు. అవేంటో తెలుసుకుందామా..!
సమతుల్య ఆహారం : మహిళలు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి సమతుల్య ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే సోయా పాలు, చీజ్, అవిసెగింజలు వంటివి వారు తీసుకునే ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
- కెఫిన్, ఆల్కహాల్, స్పైసీ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
వ్యాయామం : ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అలాగే శరీర బరువు అదుపులో ఉంచుకోవాలి. రోజూ వాకింగ్, స్విమ్మింగ్, యోగ వంటివి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
ఒత్తిడి తగ్గించుకోవాలి : ప్రతిరోజూ ధ్యానం చేస్తే ఒత్తిడిని అధిగమించొచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేసినా ఒత్తిడిని అధిగమించొచ్చు. వీటితోపాటు ప్రధానంగా ఏ విషయాన్ని అయినా స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ పంచుకుంటే ఒత్తిడి చాలావరకు దూరమవుతుందని వైద్యులు సలహా ఇస్తున్నారు.