హైదరాబాద్ : స్విగ్గీ క్విక్ కామర్స్ గ్రాసరీ విభాగం స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ తన పళ్లు కూరగాయల డెలివరీని మరింత విస్తరించినట్లు ప్రకటించింది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లోని తమ వినియోగదారులు ఇక స్థానిక పళ్లు, కూరగాయల విక్రేతలను సులభంగా చేరవచ్చని తెలిపింది. 2020లో హైదరాబాద్, 2021లో వైజాగ్, విజయవాడలో తొలిసారి కిరాణా వస్తువుల డెలివరీని ప్రారంభించింది. తాజాగా దీన్ని పళ్లు, కూరగాయల విభాగంలోకి విస్తరించినట్లయ్యింది.










