Jan 07,2023 20:54

న్యూఢిల్లీ : టెక్‌, ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భారత్‌లో 1,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 18వేల మందికి ఉద్వాసన పలకనున్నట్లు గురువారం ఆ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారత్‌లో పని చేస్తున్న లక్ష మంది ఉద్యోగుల్లో వెయ్యి మందిని ఇంటికి పంపించడానికి కసరత్తు చేస్తోందని సమాచారం. దీంతో ఒక్క శాతం ఉద్యోగులపై ప్రభావం పడనుంది. 2022 డిసెంబర్‌లో భారత్‌లో అమెజాన్‌ అకాడమీని మూసివేస్తున్నట్లు ప్రకటించగా.. ఫుడ్‌ డెలివరీ వ్యాపార విభాగం అయినా 'అమెజాన్‌ ఫుడ్‌' కార్యకలాపాలను కూడా నిలిపి వేసిన విషయం తెలిసిందే.