Jun 30,2023 22:25

ఆస్ట్రేలియాకు ఆధిక్యత
లండన్‌: యాషెస్‌ సిరీస్‌ రెండోటెస్ట్‌లోనూ ఆస్ట్రేలియా జట్టు పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 416పరుగులు చేసిన ఆస్ట్రేలియా జట్టు.. అనంతరం ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 325పరుగులకు ఆలౌట్‌ చేసింది. దీంతో ఆస్ట్రేలియా జట్టుకు 91పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత లభించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 4వికెట్ల నష్టానికి 278పరుగులతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్‌ జట్టు మరో 47పరుగులు జతచేసి 6వికెట్లను చేజార్చుకుంది. స్టార్క్‌కు మూడు, హేజిల్‌వుడ్‌, హెడ్‌కు రెండేసి, కమిన్స్‌, లియన్‌, గ్రీన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. దీంతో ఆసీస్‌ జట్టు 91పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు మూడోరోజు టి విరామ సమయానికి వికెట్‌ నష్టపోయి 120పరుగులు చేసింది. ఓపెనర్‌ ఖవాజా(57), లబూషేన్‌(25) క్రీజ్‌లో ఉండగా.. వార్నర్‌(25) టాంగ్వే బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టుకు ఇప్పటికే 209పరుగుల ఆధిక్యత లభించింది.