లీడ్స్: యాషెస్ సిరీస్ మూడో టెస్ట్‌లో బెన్ స్టోక్స్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. 108బంతుల్లో 6ఫోర్లు, 5సిక్సర్ల సాయంతో 80పరుగులు చేసి మర్ఫీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఓవర్‌నైట్ స్కోర్ 3వికెట్ల నష్టానికి 69పరుగులతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు 87పరుగులకే 5వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత వోక్స్(10), వుడ్(24) సహకారంతో బెన్ స్టోక్స్ విధ్వంస ఇన్నింగ్స్ ఆడి చివరి వికెట్‌గా పెవీలియన్‌కు చేరాడు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 52.3ఓవర్లలో 237పరుగులకు కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా జట్టుకు 26పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. కమిన్స్‌కు ఆరు, స్టార్క్‌కు రెండు, మిఛెల్ మార్ష్, మర్ఫీకి ఒక్కో వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 263
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలే (సి)వార్నర్ (బి)మార్ష్ 33, డక్కెట్ (సి)క్యారీ (బి)కమిన్స్ 2, బ్రూక్ (సి)స్మిత్ (బి)కమిన్స్ 3, రూట్ (సి)వార్నర్ (బి)కమిన్స్ 19, బెయిర్‌స్టో (సి)స్మిత్ (బి)స్టార్క్ 12, స్టోక్స్ (సి)స్మిత్ (బి)మర్ఫీ 80, మొయిన్ (సి)స్మిత్ (బి)కమిన్స్ 21, వోక్స్ (సి)క్యారీ (బి)స్టార్క్ 10, వుడ్ (సి)మార్ష్ (బి)కమిన్స్ 24, బ్రాడ్ (సి)స్మిత్ (బి)కమిన్స్ 7, రాబిన్సన్ (నాటౌట్) 5, అదనం 21. (52.3ఓవర్లలో ఆలౌట్) 237పరుగులు.
వికెట్ల పతనం: 1/18, 2/22, 3/65, 4/68, 5/87, 6/131, 7/142, 8/167, 9/199, 10/237
బౌలింగ్: స్టార్క్ 14-3-59-2, కమిన్స్ 18-1-91-6, బోలండ్ 10-0-35-0, మిఛెల్ మార్ష్ 3-1-9-1, మర్ఫీ 7.3-0-35-1.










