Nov 26,2022 21:24

వాషింగ్టన్‌ : టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి రోజూ ఏదో ఒక వార్తలో నిలుస్తున్నారు. అవసరమైతే స్మార్ట్‌ఫోన్‌ రంగంలోకి ప్రవేశిస్తామని తాజాగా పేర్కొన్నారు. టెక్‌ దిగ్గజాలు ఆపిల్‌, గూగుల్‌ సంస్థలు తన ట్విట్టర్‌ యాప్‌ను యాప్‌ స్టోర్‌ నుంచి తొలగిస్తే... తానే స్మార్ట్‌ ఫోన్‌ రంగంలోకి ప్రవేశిస్తామని ప్రకటించారు. కంటెంట్‌ నియంత్రణ సమస్యలపై ఆపిల్‌, గూగుల్‌ యాప్‌ స్టోర్‌ ట్విటర్‌ను నిషేధించే అవకాశం ఉందన్న రిపోర్టుల నేపథ్యంలో మస్క్‌ ఓ ట్వీట్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. అయితే తాను స్మార్ట్‌ ఫోన్‌ రంగంలోకి వచ్చే పరిస్థితి రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.