ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : డ్రగ్స్ కేసులో నార్కోటిక్ బ్యూరో నిందితుడిగా పేర్కొన్న నటుడు నవదీప్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. గతంలోనూ ఆయనపై డ్రగ్స్ కేసులున్నాయని నార్కోటిక్ పోలీసులు కోర్టుకు తెలిపారు. గతంలో డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేరని ఆయన తరుఫు న్యాయవాది సిద్ధార్థ్ వాదించారు. దర్యాప్తు సంస్థల ముందు నవదీప్ హాజరయ్యారని, మాదాపూర్ డ్రగ్స్ కేసుతో ఆయనకు సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి 41ఎ కింద నోటీస్ ఇచ్చి నవదీప్‌ను విచారించాలని నార్కోటిక్ పోలీసులను ఆదేశించారు.










