Apr 29,2023 10:36

ఐపీఎల్‌-2023లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. కోల్‌కతా వేదికగా మధ్యాహ్నం 3.30కి కోల్‌కతా వర్సెస్‌ గుజరాత్‌ జట్ల మధ్య పోరు జరగనుంది. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాప్‌టల్స్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. గుజరాత్‌ పాయింట్ల పట్టికలో టాప్‌ నిలవాలని చూస్తుండగా కోల్‌కతా ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పరుచుకోవాలని చూస్తోంది. మరో వైపు ఢిల్లీ, హైదరాబాద్‌ జట్టు విజయం సాధిస్తుందో లేక ఓటమిపాలై పాయింట్లు పట్టికలో చిట్ట చివరన నిలుస్తుందో చూడాలి.