Oct 25,2022 20:34

న్యూఢిల్లీ : హిటాచీ ఎనర్జీ దేశీయంగా తయారు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లను గుజరాత్‌లో అందుబాటులోకి రానున్న పునరుత్పాదక ఇంధన పార్కుకు అందించనున్నట్లు ప్రకటించింది. 4.75గిగా వాట్ల సోలార్‌ పార్కుకు వీటిని సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. కచ్‌లో 72,600 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు.