- 23గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో నయా చరిత్ర
పారిస్: సెర్బియాకు చెందిన 36ఏళ్ల నొవాక్ జకోవిచ్ టెన్నిస్ జగత్తులో నయా చరిత్రను నెలకొల్పాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో కాస్పర్ రూఢ్(నార్వే)ను ఓడించి కెరీర్‌లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టెన్నిస్ జగత్తులో 23గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన ఏకైక ఆటగానిగా జకోవిచ్ నిలిచాడు. అంతకుముందు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్(22 గ్రాండ్‌స్లామ్) టైటిళ్లుతో సమం నిలిచిన జకోవిచ్.. తాజాగా ఆ రికార్డును అధిగమించాడు. త్వరలో ప్రకటించిన డబ్ల్యుటిఏ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానంలో నిలవనున్న జకోవిచ్.. ఫామ్ చూస్తే మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గే సత్తా అతనిలో కనబడుతోంది. ఇక జకోవిచ్(34), రోజర్ ఫెదరర్(31), రఫెల్ నాదల్(30) సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లలో ఫైనల్‌కు చేరుకున్నారు. ప్రస్తుత తరం ఆటగాళ్లలో రఫెల్ నాదల్ ఫిట్‌నెస్ సమస్య కారణంగా ఏడాదిగా ఆటలకు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుత ఆటగాళ్లలోనూ జకోవిచ్‌ను ఓడించగల సత్తా ఉన్న ఆటగాడు దరిదాపుల్లో ఎవ్వరూ లేకపోవడంతో జకోవిచ్‌కు రాబోయే టోర్నీల్లోనూ తిరుగుండదు. రఫెల్ నాదల్(22), రోజర్ ఫెదరర్(20) గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను కైవసం చేసుకొని రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
జకోవిచ్ నెగ్గిన గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు
ఆస్ట్రేలియాన్ ఓపెన్ : 10
(2008, 11, 12, 13, 15, 16, 19, 20, 21, 23)
ఫ్రెంచ్ ఓపెన్ : 3 (2016, 21, 23)
వింబుల్డన్ : 7
(2011, 14, 15, 18, 19, 21, 22)
యుఎస్ ఓపెన్ : 3 (2011, 15, 18)










