Apr 16,2023 11:01

బెంగళూరు: గంగూలీ, విరాట్‌ కోహ్లిల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నట్లున్నాయి. శనివారం బెంగళూరు-ఢిల్లీ మ్యాచ్‌ మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్‌ సందర్భంగా కోహ్లి గంగూలీని కోపంగా చూస్తూ ఇచ్చిన లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఈ ఇద్దరు మరోసారి ఎదురుపడ్డారు. ఈసారి కోహ్లి గంగూలీకి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు నిరాకరించాడు. ఆర్‌సీబీ మ్యాచ్‌ గెలిచిన తర్వాత ఇరుజట్లు ఒకరినొకరు అభినందించుకుంటున్న సమయంలో పాంటింగ్‌ వెనకాలే వచ్చిన గంగూలీ వచ్చాడు. పాంటింగ్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చిన కోహ్లి గంగూలీ రాగానే పాంటింగ్‌తో కోహ్లి ఏదో మాట్లాడాడు. దీంతో దాదా కోహ్లికి చేయి ఇవ్వకుండా పక్కకి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ''కోహ్లి ఇంకా పాత గాయం మరిచిపోలేదనుకుంటా'' అని కామెంట్‌ చేశారు.
టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్‌గా తనపై వేటు పడటంలో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీనే కారణమని విరాట్‌ భావిస్తూ అతడిపై పరోక్ష విమర్శలు చేయడంతో వీరి మధ్య అగాథం ఏర్పడ్డ సంగతి తెలిసిందే.