ప్రజాశక్తి-నెల్లూరు : తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలు, ఆశాలు, సర్పంచ్‌లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తున్న నిరసనలను పోలీసుల సహాయంతో భగం చేస్తూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం నియంతృత్వపాలన సాగిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగేతర పద్ధతులను అనుసరిస్తూ అరాచక పాలన సాగిస్తున్నాయని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా సహకారంతోనే రాష్ట్రంలో వైసిపి దుర్మార్గమైన పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. సిబిఐ అధికారులు ఎంపి అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు వెళ్లినప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని, అరెస్టు చేయడం కష్టమని పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను, పౌరహక్కుల సంఘాలను, విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని ప్రజాస్వామ పరిరక్షణ కోసం 26 జిల్లాల్లో ఆది, సోమవారం రౌండ్‌టేబుల్ సమవేశాలు నిర్వహిస్తామన్నారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చూడతామని హెచ్చరించారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.










