Jul 09,2022 12:40

ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌) : ఈనెల 11 వ తేదీన జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో శనివారం నందిగామలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి కె.గోపాల్‌ మాట్లాడుతూ ... ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటికి సిపిఎం పేరిట పట్టణంలో వివిధ వార్డుల్లో తిరిగామన్నారు. నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. డ్రైనేజీ సమస్య, 18 వ వార్డ్‌ లో ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని, 7, 8 వార్డుల్లో డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 18 వ వార్డులో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలని, పట్టణంలో కూడా ఉపాధి హామీ పని అమలు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు గఅహాలకు 200 యూనిట్ల విద్యుత్‌ రాయితీ ఇస్తున్నారని , కానీ ఇప్పుడు రాయితీ లు ఇవ్వడంలేదని అన్నారు. ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం ఈ నెల 11న చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు సయ్యద్‌ ఖాసీం, కర్రీ వెంకటేశ్వరరావు, ఎం శ్రీనివాసరావు, జంగా దామోదర్‌, బత్తుల వెంకటేశ్వర్లు, ఉప్పు శీను, ఉపుతోళ్ల పుల్లయ్య, ఉపుతోళ్ల కుమారి, రోశయ్య, సిపిఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.