Jun 30,2023 13:29

ప్రజాశక్తి-తెనాలి రూరల్‌ (గుంటూరు) : విద్యుత్‌ చార్జీలు, స్మార్ట్‌ మీటర్ల భారాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ... వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రువరం తెనాలి విద్యుత్‌ శాఖ డివిజన్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వినియోగదారుల అనుమతి లేనిదే స్మార్ట్‌ మీటర్లను అమర్చకూడదని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్త ధర్నాలో భాగంగా తెనాలిలో ధర్నా నిర్వహించినట్లు సిపిఎం నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్‌ తెలిపారు. విద్యుత్‌ సంస్కరణల్లో మార్పురాకపోతే ధర్నాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు షేక్‌ హుస్సేన్‌ వలి, తుంగ బాలస్వామి, పి సురేష్‌, రాజ్యలక్ష్మి, పల్లా ఈశ్వరరావు, జి వెంకటసుబ్బయ్య, జి రవీంద్ర, డి దుర్గాప్రసాద్‌, భాస్కర్‌ చంద్‌, ఎస్‌ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.