Apr 15,2023 22:22
  • వార్నర్‌ సేనకు ఐదో ఓటమి

బెంగళూరు: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) సీజన్‌-16లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. బెంగళూరులోని చిదంబరం స్టేడియంలో జరిగిన శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 23 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. బెంగళూరు నిర్దేశించిన 174పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 9వికెట్లు కోల్పోయి 151పరుగులే చేయగల్గింది. ఢిల్లీ జట్టులో ఏకంగా ముగ్గురు డకౌట్‌ కావడంతో కోలుకోలేకపోయింది. మనీష్‌ పాండే(50) ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో అమన్‌ ఖాన్‌(18) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది. ఆరంగేట్రం మ్యాచ్‌లోనే ఆర్సీబీ పేసర్‌ విజయ్ కుమార్‌ వ్యాషక్‌ మూడు వికెట్లతో సత్తా చాటాడు. తొలుత విరాట్‌ కోహ్లి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. విరాట్‌ కోహ్లీ అర్ధ శతకం చేయడంతోపాటు మూడు క్యాచ్‌లను అందుకొని బెంగళూరు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి రెండో ఓవర్‌లోనే పెద్ద షాక్‌ తగిలింది. ప్రధాన బ్యాటర్లు ముగ్గురికి ముగ్గురు డకౌటయ్యారు. పృథ్వీ షా(0), మిచెల్‌ మార్ష్‌(0) యశ్‌ ధూల్‌(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరారు. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(19)ను విజరుకుమార్‌ వ్యాషక్‌ ఔట్‌ చేశాడు. దాంతో, 30 పరుగులకే నాలుగు వికెట్లు పడ్డాయి. అభిషేక్‌ పొరెల్‌(5), అక్షర్‌ పటేల్‌(21)తో కలిసి 40 పరుగులు జోడించాడు. ఆర్సీబీ బౌలర్లలో విజరు కుమార్‌ మూడు, సిరాజ్‌ రెండు వికెట్లు తీశారు. హర్షల్‌ పటేల్‌, పార్నెల్‌కు ఒక్కో వికెట్‌ దక్కింది.
కోహ్లీ హాఫ్‌ సెంచరీ
మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును విరాట్‌ కోహ్లీ(50) అర్ధశతకంతో రాణించాడు. డూప్లెసిస్‌(22), మ్యాక్స్‌వెల్‌(24) కాసేపు అలరించిన తక్కువకే ఔటయ్యారు. 30 బంతుల్లోనే కోహ్లీ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్‌లో 47వ అర్థశతకాన్ని నమోదు చేసి, లలిత్‌ యాదవ్‌ ఔట్‌ చేశాడు. హర్షల్‌ పటేల్‌(6) మ్యాక్స్‌వెల్‌, దినేశ్‌ కార్తిక్‌(0) వరుస బంతుల్లో ఔటయ్యారు. ఆఖర్లో అనుజ్‌ రావత్‌(15), షాబాజ్‌ అహ్మద్‌(20) ధాటిగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, మిచెల్‌ మార్ష్‌ రెండేసి వికెట్లు తీశారు. అక్షర్‌ పటేల్‌, లలిత్‌ యాదవ్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది.
స్కోర్‌బోర్డు...
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి)యశ్‌ ధుల్‌ (బి)లలిత్‌ యాదవ్‌ 50, డుప్లెసిస్‌ (సి)హకీమ్‌ ఖాన్‌ (బి)మిఛెల్‌ మార్ష్‌ 22, లెమ్రోర్‌ (సి)అభిషేక్‌ పోరెల్‌ (బి)మిఛెల్‌ మార్ష్‌ 26, మ్యాక్స్‌వెల్‌ (సి)వార్నర్‌ (బి)కుల్దీప్‌ 24, హర్షల్‌ పటేల్‌ (సి)అభిషేక్‌ పోరెల్‌ (బి)అక్షర్‌ 6, షాబాజ్‌ అహ్మద్‌ (నాటౌట్‌) 26, దినేశ్‌ కార్తీక్‌ (సి)లలిత్‌ యాదవ్‌ (బి)కుల్దీప్‌ యాదవ్‌ 0, అనుజ్‌ రావత్‌ (నాటౌట్‌) 15, అదనం 11. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 174పరుగులు.
వికెట్ల పతనం: 1/42, 2/89, 3/117, 4/132, 5/132, 6/132
బౌలింగ్‌: నోర్ట్జే 4-0-31-0, అక్షర్‌ 3-0-25-1, ముస్తఫిజుర్‌ 3-0-41-0, మిఛెల్‌ మార్ష్‌ 2-0-18-2, లలిత్‌ యాదవ్‌ 4-0-29-1, కుల్దీప్‌ యాదవ్‌ 4-1-23-2.
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి)కోహ్లి (బి)వ్యాషక్‌ 19, పృథ్వీ షా (రనౌట్‌) అనుజ్‌ రావత్‌ 0, మిఛెల్‌ మార్ష్‌ (సి)కోహ్లి (బి)పార్నెల్‌ 0, యశ్‌ ధుల్‌ (ఎల్‌బి)సిరాజ్‌ 1, మనీష్‌ పాండే (ఎల్‌బి)హసరంగ 50, అభిషేక్‌ పోరెల్‌ (సి)పార్నెల్‌ (బి)హర్షల్‌ పటేల్‌ 5, అక్షర్‌ పటేల్‌ (సి)సిరాజ్‌ (బి)వ్యాషక్‌ 21, (సి)కోహ్లి (బి)సిరాజ్‌ 18, లలిత్‌ యాదవ్‌ (సి)మ్యాక్స్‌వెల్‌ (బి)వ్యాషక్‌ 4, నోర్ట్జే (నాటౌట్‌) 23, కుల్దీప్‌ యాదవ్‌ (నాటౌట్‌) 7, అదనం 3. (20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 151పరుగులు.
వికెట్ల పతనం: 1/1, 2/1, 3/2, 4/30, 5/53, 6/80, 7/98, 8/110, 9/128
బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-23-2, పార్నెల్‌ 4-0-28-1, వ్యాషక్‌ 4-0-20-3, షాబాజ్‌ 1-0-11-0, హసరంగ 3-0-37-1, హర్షల్‌ పటేల్‌ 4-0-32-1.