May 03,2023 09:28
  • స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడ్డ డిఫెండింగ్‌ ఛాంపియన్‌

అహ్మదాబాద్‌ : ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు గుజరాత్‌ టైటాన్స్‌కు ఝలక్‌ ఇచ్చింది. తొలిగా బ్యాటింగ్‌కు ఢిల్లీ నిర్ణీత 130పరుగులే చేసినా.. గుజరాత్‌ను 125పరుగులకే కట్టడి చేసి ఐదు పరుగుల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టు మూడో విజయాన్ని సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 23 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో అక్షర్‌ పటేల్‌(27), అమన్‌ ఖాన్‌(51), రిపల్‌ పటేల్‌(23) రాణించడంతో 130పరుగుల స్కోర్‌ చేయగల్గింది. అమన్‌ 44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీని పూర్తి చేశాడు. చివర్లో రిపల్‌ పటేల్‌ 13 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 23 పరుగులు సాధించాడు. గుజరాత్‌ టైటాన్స్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ నిప్పులు చెరిగే బంతులకు ఢిల్లీ టాపార్డర్‌ కకావికలమైంది. షమీ 4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీసాడు. మోహిత్‌ శర్మకు రెండు, రషీద్‌ఖాన్‌కు ఒక వికెట్‌ దక్కాయి. ఛేదనలో గుజరాత్‌ జట్టు 32పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్‌ హార్దిక్‌ (59 నాటౌట్‌), మనోహర్‌(26), తెవాటియా(20) కలిసి జట్టును ఆదుకున్నారు. 18ఓవర్లు పూర్తయ్యేసరికి 5వికెట్లు కోల్పోయి 98పరుగులు చేసి లక్ష్యాన్ని దూరంగా నిలిచినా.. 19వ ఓవర్లో తెవాటియా వరుసగా మూడు సిక్సర్లు కొట్టి లక్ష్యానికి చేరువ చేశాడు. చివరి 6బంతుల్లో 12పరుగులు చేయాల్సిన గుజరాత్‌ను ఇషాంత్‌ శర్మ కేవలం 6పరుగులే ఇచ్చి తెవాటియాను ఔట్‌ చేశాడు. దీంతో 20 ఓవర్లు పూర్తయ్యేసరికి గుజరాత్‌ 125రపరుగులే చేయగల్గింది. ఖలీల్‌ అహ్మద్‌, ఇషాంత్‌కు రెండేసి, నోర్ట్జే, కుల్దీప్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ షమీకి దక్కింది.
 

స్కోర్‌బోర్డు..
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి)మిల్లర్‌ (బి)షమీ 0, వార్నర్‌ (రనౌట్‌) రషీద్‌ఖాన్‌ 2, ప్రియమ్‌ గార్డ్‌ (సి)సాహా (బి)షమీ 10, రెన్‌ షా (సి)సాహా (బి)షమీ 8, మనీష్‌ పాండే (సి)సాహా (సి)షమీ 1, అక్షర్‌ పటేల్‌ (సి)రషీద్‌ ఖాన్‌ (బి)మోహిత్‌ శర్మ 27, అమన్‌ (సి)మనోహర్‌ (బి)రషీద్‌ ఖాన్‌ 51, రిపల్‌ పటేల్‌ (సి)హార్దిక్‌ పాండ్యా (బి)మోహత్‌ శర్మ 23, నోర్ట్జే (నాటౌట్‌) 3, కుల్దీప్‌ యాదవ్‌ (నాటౌట్‌) 0, అదనం 5. (20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 130పరుగులు. వికెట్ల పతనం: 1/0, 2/6, 3/16, 4/22, 5/23, 6/73, 7/126, 8/130బౌలింగ్‌: షమీ 4-0-11-4, హార్దిక్‌ పాండ్యా 1-0-10-0, లిట్టిల్‌ 3-0- 27-0, రషీద్‌ ఖాన్‌ 4-0-28-1, నూర్‌ అహ్మద్‌ 4-0-20-0, మోహిత్‌ శర్మ 4-0-23-2.

గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌ : సాహా (సి)సాల్ట్‌ (బి)ఖలీల్‌ అహ్మద్‌ 0, శుభ్‌మన్‌ (సి)మనీష్‌ పాండే (బి)నోర్ట్జే 6, హార్దిక్‌ (నాటౌట్‌) 59, విజరు శంకర్‌ (బి)ఇషాంత్‌ 6, డేవిడ్‌ మిల్లర్‌ (బి)కుల్దీప్‌ 0, మనోహర్‌ (సి)అమన్‌ (బి)ఖలీల్‌ అహ్మద్‌ 26, తెవాటియా (సి)రెన్‌ షా (బి)ఇషాంత్‌ 20, రషీద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 3, అదనం 5. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 125పరుగులు. వికెట్ల పతనం : 1/0, 2/18, 3/26, 3/26, 4/32, 5/94, 6/122 బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4-1-24-2, ఇషాంత్‌ 4-0-23-2, నోర్ట్జే 4-0-39-1, కుల్దీప్‌ అహ్మద్‌ 4-0-15-1, అక్షర్‌ పటేల్‌ 4-0-24-0

1122