Apr 30,2023 06:48
  •  వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి తర్వాత
  •  ఢిల్లీపై తొమ్మిది పరుగుల తేడాతో గెలుపు
  •  ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చూపిన మిఛెల్‌ మార్ష్‌

న్యూఢిల్లీ: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఊరట లభించింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి తర్వాత అరుణ్‌జైట్లీ స్డేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు 9పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 197పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 6వికెట్లు కోల్పోయి 188పరుగులే చేయగల్గింది. తొలుత టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ను అభిషేక్‌ శర్మ అర్ధసెంచరీతో రాణించినా.. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(5) పేలవ ఫామ్‌ కొనసాగింది. సన్‌రైజర్స్‌ 21 పరుగుల వద్ద అగర్వాల్‌ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత త్రిపాఠి(10), కెప్టెన్‌ మార్‌క్రమ్‌(8), బ్రూక్‌(0) నిరాశపరచడంతో సన్‌రైజర్స్‌ 84పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో అభిషేక్‌ శర్మ(57) అర్ధసెంచరీకి తోడు క్లాసెన్‌(53; 27బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) జట్టును ఆదుకున్నారు. చివర్లో అబ్దుల్‌ సమద్‌(28), హొసైన్‌(16) కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో సన్‌రైజర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 197పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. మిఛెల్‌ మార్ష్‌కు నాలుగు, ఇషాంత్‌, అక్షర్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ను భువనేశ్వర్‌ కుమార్‌ రెండో బంతికే పెవీలియన్‌కు పంపాడు. ఆ తర్వాత మిఛెల్‌ మార్ష్‌ 63, ఫిల్‌ సాల్ట్‌ 59 పరుగుల చేసి జట్టును ఆదుకున్నారు. రెండో వికెట్‌కు వీరు 112 పరుగులు జతచేశారు. మార్కండే సాల్ట్‌ను ఔట్‌ చేసి ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత ఢిల్లీ పరిస్థితి తారుమారైంది. మనీష్‌(1), రియాన్‌ పరాగ్‌(9), సర్ఫరాజ్‌ ఖాన్‌(9) నిరాశపరిచారు. దాంతో, హ్యాట్రిక్‌ విక్టరీ కొట్టాలనుకున్న వార్నర్‌ సేనకు సొంత మైదానంలో నిరాశే ఎదురైంది. ఆ తర్వాతి ఓవర్లో మనీశ్‌ పాండే(1)ను క్లాసెన్‌ స్టంపౌట్‌ చేశాడు. ఆ వెంటనే ప్రియం గార్గ్‌(10), సర్ఫరాజ్‌ ఖాన్‌(9) డగౌట్‌కు క్యూ కట్టారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో మయాంక్‌ మార్కండేకు రెండు, నటరాజన్‌, భువనేశ్వర్‌, అభిషేక్‌ శర్మ, అకిల్‌ హొసెన్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మిఛెల్‌ మార్ష్‌కు లభించింది.

  • స్కోర్‌బోర్డు..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (సి)వార్నర్‌ (బి)అక్షర్‌ 67, మయాంక్‌ అగర్వాల్‌ (సి)సాల్ట్‌ (బి)ఇషాంత్‌ 5, త్రిపాఠి (సి)మనీష్‌ పాండే (బి)మిఛెల్‌ మార్ష్‌ 10, మార్‌క్రమ్‌ (సి)అక్షర్‌ (బి)మిఛెల్‌ మార్ష్‌ 8, హరీ బ్రూక్‌ (సి)అక్షర్‌ (బి)మిఛెల్‌ మార్ష్‌ 0, క్లాసెన్‌ (నాటౌట్‌) 53, అబ్దుల్‌ సమద్‌ (సి)సాల్ట్‌ (బి)మిఛెల్‌ మార్ష్‌ 28, అఖీల్‌ హొసైన్‌ (నాటౌట్‌) 16, అదనం 10. (20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 197పరుగులు.

వికెట్ల పతనం: 1/21, 2/44, 3/83, 4/83, 5/109, 6/162 బౌలింగ్‌: ఇషాంత్‌ 3-0-31-1, నోర్ట్జే 4-0-44-0, ముఖేష్‌ కుమార్‌ 2-0- 38-0, మిఛెల్‌ మార్ష్‌ 4-1-27-4, కుల్దీప్‌ యాదవ్‌ 3-0-27-0, అక్షర్‌ 4-0-29-1.
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: డేవిడ్‌ వార్నర్‌ (బి)భువనేశ్వర్‌ కుమార్‌ 0, సాల్ట్‌ (సి అండ్‌ బి) మార్ఖండే 59, మిఛెల్‌ మార్ష్‌ (సి)మార్‌క్రమ్‌ (బి)అఖిల్‌ హొసైన్‌ 63, మనీష్‌ పాండే (స్టంప్‌)క్లాసెన్‌ (బి)అభిషేక్‌ శర్మ 1, రియాన్‌ పరాగ్‌ (బి)మార్ఖండే 12, సర్ఫరాజ్‌ ఖాన్‌ (బి)నటరాజన్‌ 9, అక్షర్‌ పటేల్‌ (నాటౌట్‌) 29, రిపల్‌ పటేల్‌ (నాటౌట్‌) 11, అదనం 4. (20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 188పరుగులు.

వికెట్ల పతనం: 1/0, 2/122, 3/115, 4/125, 5/140, 6/148 బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-45-1, హొసైన్‌ 4-0-40-1, నటరాజన్‌ 4-0-34-1, ఉమ్రన్‌ 1-0-22-0, మార్ఖండే 4-0-22-2, అభిషేక్‌ 3-0-25-1.