- ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్
- 182 పరుగుల లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో
ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.4 ఓవర్లలోనే అందుకుంది. ఢిల్లీ ఓపెనర్ ఫిల్ సాల్ట్.. కేవలం 45 బంతుల్లోనే 87 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 6 సిక్సులతో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ జట్టులో కెప్టెన్ డేవిడ్ వార్నర్ 22, మిచెల్ మార్ష్ 26 పరుగులు చేయగా... రిలీ రూసో 35 బంతులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో వచ్చిన అక్షర్ పటేల్ ఓ భారీ సిక్స్ బాది అలరించాడు. ఆర్సీబీ బౌలర్లలో హేజెల్ వుడ్ 1, కర్ణ్ శర్మ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. గత మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై 126 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకున్న బెంగళూరు జట్టు ఇవాళ 181 పరుగులను కాపాడుకోలేకపోయింది.
బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఖలీల్ (బి) ముకేశ్ 55బీ డుప్లెసిస్ (సి) అక్షర్ (బి) మార్ష్ 45బీ మ్యాక్స్‌వెల్ (సి) సాల్ట్ (బి) మార్ష్ 0బీ లొమ్రార్ నాటౌట్ 54బీ కార్తీక్ (సి) వార్నర్ (బి) ఖలీల్ 11బీ అనూజ్ నాటౌట్ 8బీ ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 181
వికెట్ల పతనం: 1-82, 2-82, 3-137, 4-172
బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4-0-45-1బీ అక్షర్ పటేల్ 3-0-17-0బీ ఇషాంత్ శర్మ 3-0-29-0బీ ముకేశ్ కుమార్ 3-0-30-1బీ మిచెల్ మార్ష్ 3-0-21-2బీ కుల్‌దీప్ యాదవ్ 4-0-37-0
ఢిల్లీ ఇన్నింగ్స్: వార్నర్ (సి) డుప్లెసిస్ (బి) హేజిల్‌వుడ్ 22బీ సాల్ట్ (బి) కర్ణ్‌శర్మ 87బీ మిచెల్ మార్ష్ (సి) లొమ్రార్ (బి) హర్షల్ 26బీ రొసో నాటౌట్ 35బీ అక్షర్ నాటౌట్ 8బీ ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (16.4 ఓవర్లలో 3 వికెట్లకు) 187
వికెట్ల పతనం: 1-60, 2-119, 3-171
బౌలింగ్: సిరాజ్ 2-0-28-0బీ మ్యాక్స్‌వెల్ 1.4-0-14-0బీ హేజిల్‌వుడ్ 3-0-29-1బీ హసరంగ 4-0-32-0బీ కర్ణ్‌శర్మ 3-0-33-1బీ లొమ్రార్ 1-0-13-0బీ హర్షల్ పటేల్ 2-0-32-1










