ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి మూడు మ్యాచుల్లో ఓడి హ్యాట్రిక్ నమోదు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. అయినా ఢిల్లీ ఆటలో మార్పు రాలేదు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, 19.4 ఓవర్లలో 172 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, అక్షర్‌పటేల్ హాఫ్ సెంచరీతో రాణించారు. మూడు మ్యాచుల్లో విఫలమైన పథ్వీ షా, నేటి మ్యాచ్‌లో అదే రిపీట్ చేశాడు. 10 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన పృథ్వీ షా, హృతీక్ షోకీన్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మనీశ్ పాండే 18 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న అండర్19 వరల్డ్ కప్ 2022 విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్, 4 బంతుల్లో 2 పరుగులు చేసి రిలే మెడరిత్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. రోవ్‌మన్ పావెల్ 4 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసి పియూష్ చావ్లా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. లలిత్ యాదవ్ కూడా 4 బంతుల్లో 2 పరుగులు చేసి పియూష్ చావ్లా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ దశలో డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ కలిసి ఆరో వికెట్‌కి 35 బంతుల్లో 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఆదుకున్నారు. 21 బంతుల్లో ఐపీఎల్‌లో మొటట్మొదటి హాఫ్ సెంచరీ పూర్తి చేస్నుకన్న అక్షర్ పటేల్, 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు చేసి జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో అర్షద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. 47 బంతుల్లో 6 ఫోర్లతో 51 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..
- వరుసగా 4 వికెట్లు
వార్నర్ అవుటైన తర్వాతి బంతికే కుల్దీప్ యాదవ్ రనౌట్ అయ్యాడు. అదే ఓవర్‌లో అభిషేక్ పోరెల్, భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. మొదటి 2 ఓవర్లలో వికెట్ తీయలేకపోయిన జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీశాడు. రనౌట్ కూడా కావడంతో 19వ ఓవర్‌లో 4 వికెట్లు కోల్పోయింది. 20వ ఓవర్‌లో మూడో బంతికి ఫోర్ బాదిన నోకియా, ఆ తర్వాతి బంతికి క్లీన్ బౌల్డ్ కావడంతో ఢిల్లీ ఇన్నింగ్స్‌కి తెరపడింది. పియూష్ చావ్లా 3,జాసన్ బెహ్రెండోర్ఫ్ 3, రిలే మెరెడిత్ 2, హృతిక్ షోకీన్ 1 వికెట్ తీసుకున్నారు.
- అక్షర్ దూకుడు.. ఢిల్లీ 151/5
అక్షర్ పటేల్ దూకుడుగా ఆడుతున్నాడు. అక్షర్ పటేల్ 19 బంతుల్లో 42 పరుగులతో దాటిగా ఆడుతున్నాడు. 17 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వార్నర్ వరుసగా మూడో అర్థశతకంతో చేశాడు.
- సగం వికెట్లు డౌన్.. ఢిల్లీ 105/5
12 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డేవిడ్ వార్నర్ ఓక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఢిల్లీ 105/5 పరగులుగా ఉంది. వార్నర్ 36, అక్షర్ పటేల్ 2 పరుగులో క్రీజులో ఉన్నారు.
- లలిత్ బౌల్డ్
2 పరుగులు చేసిన లలిత్ యాదవ్ పీయూష్ చావ్లా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి అక్షర్ పటేల్ వచ్చాడు. వార్నర్46 పరుగులతో ఉన్నాడు.
- రోవ్‌మన్ పావెల్ ఎల్‌బీ
4 పరుగులు చేసిన రోవ్‌మన్ పావెల్ పీయూష్ చావ్లా బౌలింగ్‌లో ఎల్‌బీగా పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి లలిత్‌యాదవ్, వార్నర్ ఉన్నారు.
- యష్‌దుల్ ఔట్
2 పరగులు చేసిన యష్‌దుల్ రిలే మెరెడిత్ బౌలింగ్‌లో నేహాల్ వధేరాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
- మనిష్ పాండే ఔట్.. ఢిల్లీ 76/2
76 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన పాండే పీయూష్ చావ్లా బౌలింగ్‌లో బెహ్రెండోర్ఫ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. పాండే 18 బంతులో 5 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. క్రీజులోకి యశ్ ధుల్ వచ్చాడు. మరో వైపు క్యెప్టెన్ వార్నన్ ఆచితూచి ఆడుతు పరుగులు చేస్తున్నాడు.
- పాండే దుకుడు.. ఢిల్లీ 75/1
మనిష్ పాండే దుకుడుగా ఆడుతున్నాడు. మనిష్ పాండే 16 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. వార్నర్ 23 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 75 పరుగులు చేసింది.
- 6 ఓవర్లుకు 51
6 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 16 బంతుల్లో 18 పరుగులు, మనీష్ పాండే 10 బంతుల్లో 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.
- తొలి వికెట్ డౌన్
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే ఎదరుదెబ్బ తగిలింది. జట్టు ఓపెనర్ పృధ్వీషా 15 పరగులు చేసి హృతిక్ షోకీన్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్‌ను క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి మానిష్ పాండే వచ్చాడు. వార్నర్ 17 పరుగులు చేశాడు.
- టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇరుజట్లు ఇంతవరకు బోణీ చేయలేదు. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్) : రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హృతిక్ , అర్షద్ ఖాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, రిలే మెరెడిత్
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ ): పథ్వీ షా, డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీష్ పాండే, యశ్ ధుల్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ముస్తాఫిజుర్ రెహమాన్










