Apr 20,2023 21:30

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గురువారం 28వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, కేకేఆర్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో కేకేఆర్‌ తొలుత బ్యాటింగ్‌ చేయనుంది. ఇక, బంగ్లాదేశ్ స్టార్ బ్యాట్స్ మన్ లిట్టన్ దాస్ ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు. లిట్టన్ దాస్ కోల్ కతా జట్టులో ఓపెనర్ గా బరిలో దిగనున్నాడు.  ఓపెనర్ జగదీశన్ బదులు జాసన్ రాయ్ బరిలో దిగుతున్నాడు. లాకీ ఫెర్గుసన్ స్థానంలో కుల్వంత్ ఖెజ్రోలియాకు అవకాశం ఇచ్చారు. ఢిల్లీ జట్టులో ఫిలిప్ సాల్ట్ జట్టులోకి వచ్చాడు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ చాలా రోజుల తర్వాత మళ్లీ ఐపీఎల్ బరిలో దిగుతుండడం విశేషం.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: జాసన్‌ రారు, లిట్టన్‌ దాస్‌, వెంకటేష్‌ అయ్యర్‌, నితీష్‌ రాణా, మన్‌దీప్‌ సింగ్‌, ఆండ్రీ రస్సెల్‌, రింకూ సింగ్‌, సునీల్‌ నరైన్‌, కుల్వంత్‌ ఖేజ్రోలియా, ఉమేష్‌ యాదవ్‌, వరుణ్‌ చకరవర్తి
ఢిల్లీ క్యాపిటల్స్‌ : డేవిడ్‌ వార్నర్‌ , ఫిలిప్‌ సాల్ట్‌ , మిచెల్‌ మార్ష్‌, మనీష్‌ పాండే, అక్షర్‌ పటేల్‌, అమన్‌ హకీమ్‌ ఖాన్‌, లలిత్‌ యాదవ్‌, కుల్దీప్‌ యాదవ్‌, అన్రిచ్‌ నార్ట్జే, ఇషాంత్‌ శర్మ, ముఖేష్‌ కుమార్‌

 

  • వర్షం కారణంగా టాస్‌ ఆలస్యం

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గురువారం 28వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, కేకేఆర్‌ తలపడుతున్నాయి. వర్షం కారణంగా టాస్‌ ఆలస్యం కానుంది. సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైన ఢిల్లీ ఇంతవరకు బోణీ చేయలేకపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్‌లో వార్నర్‌, అక్షర్‌పటేల్‌ మినహా ఎవరు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడడం లేదు. సొంత గ్రౌండ్‌లో ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి తొలి విజయాన్ని నమోదు చేస్తుందేమో చూడాలి.