- పన్నెండోసారీ ప్లేఆఫ్స్‌లోకి
ఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరో రికార్డు నెలకొల్పింది. మెగా టోర్నీలో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టుగా ఇప్పటికే రికార్డుకెక్కిన చెన్నై.. ఆ సంఖ్యను మరింత పెంచుకుంది. తాజాగా దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి మరీ చెన్నై (సిఎస్‌కె) ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. మొత్తం 16 సీజన్లలో 12 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన ఏకైక జట్టు సిఎస్‌కె. ఆ తర్వాత ముంబయి (ఈ సీజన్‌లో కాకుండా) తొమ్మిది సార్లు చేరుకుంది. రెండు సీజన్లలో సిఎస్‌కెపై నిషేధం పడిన సంగతి తెలిసిందే. మరో రెండుసార్లు మాత్రమే లీగ్ స్టేజ్‌కు పరిమితమైంది. ఇప్పటి వరకు నాలుగు టైటిళ్లను సిఎస్‌కె సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) రొసో (బి) చేతన్ 79; కాన్వే (సి) అమన్ (బి) నోకియా 87; శివమ్ దూబె (సి) లలిత్ (బి) ఖలీల్ 22; ధోని నాటౌట్ 5; జడేజా నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు 10;
మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 223;
కెట్ల పతనం: 1-141, 2-195, 3-195;
బౌలింగ్: ఖలీల్ 4-0-45-1; లలిత్ 2-0-32-0; అక్షర్ 3-0-32-0; నోకియా 4-0-43-1; చేతన్ 4-0-36-1; కుల్‌దీప్ 3-0-34-0
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) రాయుడు (బి) తుషార్ 5; వార్నర్ (సి) రుతురాజ్ (బి) పతిరన 86; సాల్ట్ (సి) రహానె (బి) చాహర్ 3; రొసో (బి) చాహర్ 0; యశ్ ధుల్ (సి) తుషార్ (బి) జడేజా 13; అక్షర్ (సి) రుతురాజ్ (బి) చాహర్ 15; అమన్ (సి) అలీ (బి) పతిరన 7; లలిత్ (సి) అలీ (బి) తీక్షణ 6; నోకియా నాటౌట్ 0; కుల్‌దీప్ ఎల్బీ (బి) తీక్షణ 0; చేతన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 11;
మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 146;
వికెట్ల పతనం: 1-5, 2-26, 3-26, 4-75, 5-109, 6-131, 7-144, 8-146, 9-146;
బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-22-3; తుషార్ 4-0-26-1; తీక్షణ 4-1-23-2; జడేజా 4-0-50-1; పతిరన 4-0-22-2
- పవర్ ప్లే పూర్తి .. ఢిల్లీ 34/3
పవర్ ప్లే పూర్తయ్యే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. వార్నర్ 17 బంతుల్లో 25 పరుగులు, యష్ దయాల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు పృథ్వీషా 5, ఫిలిప్ సాల్ట్ 3, రిలీ రోసౌవ్ డక్‌ఔట్‌గా పెవిలియన్‌కు చేరారు.
An excellent start with the ball for @ChennaiIPL as @deepak_chahar9 gets two in two 👌🏻👌🏻@DelhiCapitals move to 34/3 at the end of powerplay
— IndianPremierLeague (@IPL) May 20, 2023
Follow the match ▶️ https://t.co/ESWjX1m8WD #TATAIPL | #DCvCSK pic.twitter.com/D6cNcgIxJj
- ఒకే ఓవర్‌లో 2 వికెట్లు
చైన్నై ఆటగాడు దీపక్ చాహర్ వేసిన 5వ ఓవర్‌లో రెండు వికెట్లు తీసుకున్నాడు. తొలుత ఫిలిప్ సాల్ట్‌ను ఔట్ చేసిన చాహర్, ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన లీ రోసౌవ్‌ను కీన్ బౌల్డ్ చేశాడు. ఢిల్లీ ప్రస్తుతం 5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది.
- సాల్ట్ ఔట్
3 పరుగులు చేసిన ఫిలిప్ సాల్ట్ దీపక్ చాహర్ బౌలింగ్‌లో అజింక్యా రహానేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి రిలీ రోసౌవ్ వచ్చాడు.
- మూడు ఓవర్లకు ఢిల్లీ 9/1
మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 2, ఫిలిప్‌సాల్ట్ 2 పరుగులు చేశారు.
- పృథ్వీషా ఔట్
5 పరుగులు చేసిన పృథ్వీషా తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో అంబటి రాయుడికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి ఫిలిప్ సాల్ట్ వచ్చాడు.
- బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ
223 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు పృథ్వీషా, వార్నర్ బ్యాటింగ్ ప్రారంభించారు. తొలి ఓవర్‌లో ఆడిన పృథ్వీషా 5 పరుగులు చేశాడు.
- ఢిల్లీ లక్ష్యం 224
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగుతున్న కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 223 పరుగులు చేసి.. ఢిల్లీకి 224 పరుగుల టార్గేట్‌ను నిర్దేశించింది. చెన్నై బ్యాటింగ్‌లో డెవన్ కాన్వే కాన్వే (52 బంతుల్లో 11 ఫోర్లు, 3సిక్స్‌లు సాయంతో) 87పరుగులు , రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో) 79 దాటిగా ఆడతంతో చెన్నై 200 పరుగులు మార్క్‌ను ఆందుకుంది. రుతురాజ్ గైక్వాడ్ ఔటైన తరువాత క్రీజులోకి వచ్చి శివమ్ దూబే 9 బంతుల్లో 22 పరుగులు తూపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. దూబే తరువాత క్రీజులోకి వచ్చిన జడేజా 7 బంతుల్లో 20, ధోని 4 బంతుల్లో 5 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జే తలో వికెట్ తీసుకున్నారు.
JADEJA adds joy to @ChennaiIPL's brilliant batting display with a powerful finish 😎#TATAIPL | #DCvCSK | @imjadeja pic.twitter.com/uXVAvl9JoY
— IndianPremierLeague (@IPL) May 20, 2023
- కాన్వే ఔట్
87 పరుగులు చేసిన డెవన్ కాన్వే అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో అమన్ హకీంకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాన్వే 52 బంతుల్లో 87 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3సిక్స్‌లు ఉన్నాయి. క్రీజులోకి జడేజా వచ్చాడు.
Devon Conway's incredible 87-run knock comes to an end 👏🏻👏🏻@DelhiCapitals bounce back with two quick wickets!
— IndianPremierLeague (@IPL) May 20, 2023
Follow the match ▶️ https://t.co/ESWjX1m8WD #TATAIPL | #DCvCSK pic.twitter.com/EAVmwTxiV4
- రెండో వికెట్ డౌన్
9 బంతుల్లో 22 పరుగులు చేసిన శివమ్ దూబే ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో లలిత్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవలియన్‌కు చేరాడు. మరో వైపు కాన్వే 87 పరుగులు మీద బ్యాటింగ్ చేస్తున్నాడు. చెన్నై ప్రస్తుతానికి 2 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
- దాటిగా ఆడుతున్న డెవన్ కాన్వే
చెన్నై ఓపెనర్ డెవన్ కాన్వే దూకుడుగా ఆడుతూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. 17 ఓవరు ముగిసే సరికి కాన్వే 48 బంతుల్లో 86 పరుగులు చేశాడు. శివమ్ దూబే 9 పరుగులు మీద బ్యాటింగ్ చేస్తున్నాడు.
- 16 ఓవర్లుకు 161
16 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై వికెట్ నష్టానిక 161 పరుగులు చేసింది. డెవన్ కాన్వే 75, శివమ్ దూబే 8 పరుగుల మీద ఆడుతున్నారు.
- రుతురాజ్ గైక్వాడ్ ఔట్
79 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ చేతన్ సకారియా బౌలింగ్‌లో రిలీ రోసౌవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. గైక్వాడ్ 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 79 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. చైన్ ప్రస్తుతం వికేట్ నష్టానికి 141 పరుగులు చేసింది. క్రీజులో డెవన్ కాన్వే, శివమ్ దూబే ఉన్నారు.
- డెవన్ కాన్వే 50.. చెన్నై 140/0
14 ఓవర్‌లో చెన్నై ఓపెనర్ డెవన్ కాన్వే 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. డెవన్ కాన్వే ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.
Fifty off just 33 deliveries for Devon Conway 👊🏻
— IndianPremierLeague (@IPL) May 20, 2023
The opening partnership is nearing the 150-run mark now 😎
Who will get the all-important wicket for #DC?
Follow the match ▶️ https://t.co/ESWjX1m8WD #TATAIPL | #DCvCSK pic.twitter.com/MZfzvtUKvg
- దూకుడుగా ఆడుతోన్న గైక్వాడ్.. చెన్నై127/0
చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ దూకుడుగా ఆడుతోన్నాడు. 46 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. మరో వైపు డెవన్ కాన్వే 32 బంతుల్లో 47 పరుగులతో సహాకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం చెన్నై 13 ఓవర్లు ముగిసే సరికి 127 పరుగులు చేసింది.
Dilli main Gaikwad ka hain 𝐫𝐚𝐣 🙌#DCvCSK #IPLonJioCinema #TATAIPL #IPL2023 #EveryGameMatters | @ChennaiIPL pic.twitter.com/OCIEDKgfQ8
— JioCinema (@JioCinema) May 20, 2023
- 10 ఓవర్లు పూర్తి.. చెన్నై 87/0
10 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. డెవన్ కాన్వే 35, రుతురాజ్ గైక్వాడ్ 50, పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
- గైక్వాడ్ 50
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 37 బంతుల్లో 3 సిక్స్‌లు, 3 ఫోర్ల సాయంతో 50 పరుగులు మార్క్‌ను అందకున్నాడు.
Two in Two 💥💥@Ruutu1331 takes the aerial route and smacks quality maximums 🙌#TATAIPL | #DCvCSK pic.twitter.com/rWvzo6M2BG
— IndianPremierLeague (@IPL) May 20, 2023
- 8 ఓవర్లుకు 66
8 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై 66 పరుగులు చేసింది. డెవన్ కాన్వే 31, రుతురాజ్ గైక్వాడ్ 33 పరుగులు చేశారు.
- పవర్ ప్లే పూర్తి..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే దూకుడుగా ఆడుతోంది. 6 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. డెవన్ కాన్వే 28, రుతురాజ్ గైక్వాడ్ 22 పరుగులతో ఆడుతున్నారు.
- 3 ఓవర్లుకు 30
3 ఓవర్లు ముగిసే సరికి చెన్నై 30 పరగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 10 బంతుల్లో 11 పరుగులు, డెవన్ కాన్వే 8 బంతుల్లో 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.
- టాస్ గెలిచిన చెన్నై.. తొలుత బ్యాటింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ ముందుగా బౌలింగ్ చేయనుంది. ఈరోజు చెన్నై గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది.
<
#Dhoni wins the toss & #CSK will bat first in this crucial #DCvCSK clash 💥
— JioCinema (@JioCinema) May 20, 2023
What total will be a match-winning one? 👀💬#IPLonJioCinema #TATAIPL #IPL2023 #EveryGameMatters | @ChennaiIPL @DelhiCapitals pic.twitter.com/NScmM2qvjG
br /> ఇరుజట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (కీపర్), రిలీ రోసౌవ్, యష్ ధుల్, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే.
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ధోని(కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.










