Sep 21,2023 22:08
  •  బిఎసి సమావేశానికి టిడిపి దూరం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : శాసనసభ సమావేశాలను ఐదు రోజులపాటు నిర్వహించాలని బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బిఎసి) సమావేశం నిర్ణయించింది. స్పీకరు తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జోగి రమేష్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. శాసనసభ సమావేశాలు ఐదు రోజులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 21, 22, 25, 26, 27 తేదీల్లో నిర్వహించాలని, శని, ఆదివారాలు సమావేశాలకు సెలవుగా ప్రకటించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు పెట్టారని నిరసిస్తూ.. బిఎసి సమావేశానికి టిడిపి హాజరుకాలేదు.