- గతేడాదిలో పోలిస్తే 15 శాతం పెరుగుదల
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు 2022 డిసెంబరులో భారీగా పెరిగాయి. డిసెంబరులో జిఎస్‌టి రెవెన్యూలు దాదాపు రూ.1.5 లక్షల కోట్లకుచేరినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. 2021 డిసెంబరు వసూళ్లతో పోలిస్తే 15 శాతం పెరిగినట్లు పేర్కొంది. 2022 నవంబరు నెలతో పోలిస్తే 2.5 శాతం అధికంగా వసూళ్లు రాబట్టినట్లు తెలిపింది. ఆర్థికశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2022 డిసెంబరులో జిఎస్‌టి వసూళ్లు రూ.1,49,507 కోట్లగా ఉనాుయి. ఈ వసూళ్లలో సెంట్రల్ జిఎస్‌టి రూ.26,711 కోట్లు కాగా, రాష్ట్ర జిఎస్‌టి రూ.33,357 కోట్లు గానూ, ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టి రూ.78,434 కోట్లుగా ఉంది. ఇందులో వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన జిఎస్‌టితో రూ.40,263గా ఉంది. సెస్ రూ.11,005 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.851 కోట్లతో కలిపి) ఉంది. కాగా జిఎస్‌టి వసూళ్లు రూ.1.4 లక్షల కోట్లకుపైబడి వసూలు కావడం వరుసగా పదో నెల కావడం విశేషం. డిసెంబర్ వసూళ్లలో వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం 8 శాతం ఎక్కువ ఉండగా, దేశీయ లావాదేవీల (సేవల దిగుమతితో సహా) వల్ల వచ్చే ఆదాయాలు 18 శాతం ఎక్కువగా ఉన్నాయి.
- ఏపిలో 16 శాతం పెరుగుదల
ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది డిసెంబర్‌లో జిఎస్‌టి వసూళ్లు రూ.2,532 కోట్లు ఉండగా, అది ఈ ఏడాది 26 శాతం మేర పెరిగి రూ.3,182 కోట్లకు చేరిందని ఆర్థికశాఖ తెలిపింది. ఇక తెలంగాణలో గత ఏడాది రూ.3,760 కోట్లుగా ఉను జిఎస్‌టి వసూళ్లు 11 శాతం మేర పెరిగి, రూ.4,178 కోట్లుగా ఉందని వెల్లడించింది.










