Feb 23,2023 13:34

రిషబ్‌ పంత్‌ గతేడాది చివర్లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం బెడ్‌ రెస్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే. నేపథ్యంలో మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న 2023 ఐపీఎల్‌ సీజన్‌లో పంత్‌ దూరం కానున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌ ఎంపిక అనివార్యమైంది. డీసీ సారధ్య బాధ్యతలను ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌కు యాజమాన్యం అప్పగించినట్లు మేనేజ్‌మెంట్‌లోని ఓ కీలక వ్యక్తి ప్రముఖ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌కు తెలిపారు. కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ను ఎంపిక చేసుకున్న యాజమాన్యం.. వైస్‌ కెప్టెన్‌గా అక్షర్‌ పటేల్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. వార్నర్‌ గతంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు: డేవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), అక్షర్‌ పటేల్‌ (వైస్‌ కెప్టెన్‌), రిపల్‌ పటేల్‌, మనీశ్‌ పాండే, రిలీ రొస్సో, రోవమన్‌ పావెల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, పృథ్వీ షా, యశ్‌ ధుల్‌, ఫిల్‌ సాల్ట్‌, రిషబ్‌ పంత్‌, మిచెల్‌ మార్ష్‌, అమన్‌ హకీం ఖాన్‌, లలిత్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, ముకేశ్‌ కుమార్‌, అన్రిచ్‌ నోర్జే, ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌, లుంగి ఎంగిడి, ఖలీల్‌ అహ్మద్‌, చేతన్‌ సకారియా, కమలేష్‌ నాగర్‌కోటి, ప్రవీణ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్‌, విక్కీ ఓస్వాల్‌