న్యూఢిల్లీ : వాణిజ్య వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ అనుబంధ సంస్థ అయినా టిఎంఎల్ సివి మొబిలిటీకి ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డిటిసి) 1500 ఇవి బస్‌ల ఆర్డర్‌ను ఇచ్చింది. దీనిపై ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటిని సరఫరా చేయడంతో పాటుగా 12 ఏళ్ల పాటు మెయింటనెన్స్ కూడా చేయనుంది. ఇది తమకు అతిపెద్ద ఆర్డర్ అని టిఎంఎల్ సివి మొబిలిటీ ఛైర్మన్ అసీమ్ కుమార్ తెలిపారు.










