Dec 13,2022 21:12

న్యూఢిల్లీ : ప్రముఖ టెక్‌ దిగ్గజం సిస్కో ఉద్యోగుల తొలగింపునకు కసరత్తును ప్రారంభించిందని సమాచారం. సంస్థలోని 4,000 మంది సిబ్బందికి ఉద్వాసన పలకనుందని మంగళవారం పలు రిపోర్టులు వచ్చాయి. ఈ విషయమై నెల క్రితమే వార్తలు రాగా.. తాజాగా ఈ ప్రక్రియను వేగవంతం చేసిందని సమాచారం. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. తొలగింపు ఉద్యోగులకు సరైన పరిహార ప్యాకేజీతో పాటు ఇతర మద్దతును అందించడానికి ప్రయత్నాలు చేస్తోన్నట్లు ఆ కంపెనీ వర్గాల సమాచారం.