ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : మండలంలోని దబ్బగడ్డ పంచాయతీ విజయరాంపురం రెవెన్యూ పరిధిలోని పిడుగుపాటుకు గురై ఆవు మృతి చెందింది. కోన గ్రామానికి చెందిన రైతు సింహాచలం తన ఆవులను శనివారం మేతకు తీసుకువెళ్లాడు. సాయంత్రం మేత మేసి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడింది. అదే సమయంలో పిడుగు కూడా పడటంతో కాపరి సింహాచలం మిగిలిపోయి పశువులను తోలుకొని వచ్చాడు. ఆదివారం ఉదయం పశువును లెక్క చూసుకుంటూ ఉండగా ఒక్క ఆవు లేకపోవడంతో ఘటనా స్థలానికి వెళ్లారు. దీంతో మృతి చెందిన ఆవు కనిపించింది. స్థానిక వెటర్నరీ ఉద్యోగి రమేష్ ను తీసుకుని వెళ్లి పరిశీలన చేశారు. ఏ విధమైన ఇన్సూరెన్స్ లేకపోవడంతో బాధితుడు బోరునవిలపిస్తున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.