Dec 07,2022 21:01

చెన్నై: వ్యవసాయ ఉత్పత్తుల సంస్థ అయిన కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఈ రంగంలో సాంకేతికతను పెంపొందించడం మీద తన దృష్టిని నిరంతరం కేంద్రీకరిస్తోన్నట్లు పేర్కొంది. ఇందుకోసం సాంకేతికత ఆధారిత వ్యవసాయంలో వ్యూహాత్మకమైన పెట్టుబడులను కోరమాండల్‌ పెడుతోందని తెలిపింది. ఈ క్రమంలోనే సంస్థ ఒక విభిన్నమైన డ్రోన్‌ అంకుర సంస్థ అయిన దక్ష అన్‌మ్యాన్డ్‌ సిస్టమ్‌లో ఇటీవలే రూ.20 కోట్ల పెట్టుబడులను పెట్టినట్లు తెలిపింది. కోరమాండల్‌ వారి వెంచర్‌ క్యాపిటల్‌ విభాగమైన డేర్‌ వెంచర్స్‌ ద్వారా ఈ పెట్టుబడి పెట్టడం జరిగిందని వెల్లడించింది.