Aug 23,2022 08:53

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : నాగార్జున సాగర్‌, పులిచింతల జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం రాత్రి ఏడు గంటలకు నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి 1.30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతలకు 62 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా..58 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి 1.48 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 13 వేల క్యూసెక్కులను తూర్పు, పశ్చిమ డెల్టాల కాల్వలకు, 1.35 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.