Jul 31,2023 10:01

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం సీనియర్‌ నాయకులు బుద్ధదేవ్‌ భట్టాచార్య (79) ఆరోగ్యం క్లిష్టంగానే ఉన్నా, నిలకడగా ఉందని వైద్య నిపుణులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఉడ్‌ల్యాండ్స్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒ డాక్టర్‌ రూపాలి బసు ఒక ప్రకటన విడుదల చేశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఉడ్‌ల్యాండ్స్‌ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో నాన్‌ ఇన్వాసివ్‌ వెంటిలేటర్‌పై ఉంచి వివిధ విభాగాల వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తోందని రూపాలి బసు పేర్కొన్నారు.