ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రకాశం జిల్లా సంతనూతలపాడు తహశీల్దారు లక్ష్మీనారాయణరెడ్డిపై దాడిని ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, చేబ్రోలు కృష్ణమూర్తి తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.










