ఐర్లాండ్‌పై రెండోటెస్ట్‌లో ఇన్నింగ్స్ 10పరుగుల తేడాతో గెలుపు
సిరీస్ 2-0తో కైవసం
గాలే: రెండోటెస్ట్‌లోనూ శ్రీలంక గెలిచి టెస్ట్ రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.2 వికెట్ల నష్టానికి 54పరుగులతో ఐదో, చివరిరోజు ఆటను కొనసాగించిన ఐర్లాండ్ జట్టు 202 పరుగులకు ఆలౌటైంది. టెక్కర్(85), కెప్టెన్ ఆండ్రూ(46) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. రమేశ్ మెండీస్‌కమైదు, ఫెర్నాండోకు మూడు, జయసూరియకు రెండు వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 3వికెట్ల నష్టానికి 704పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేయగా.. ఐర్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 492పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రభాత్ జయసూరియకు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కుశాల్ మెండీస్‌కు లభించాయి. తొలిటెస్ట్‌లో శ్రీలంక జట్టు ఇన్నింగ్స్ 280పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచిన సంగతి తెలిసిందే.










