Sep 27,2023 20:57

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : తిరుమల శ్రీవారి మెట్టు నడకదారిలోని టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి నివాసం వద్ద చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో బుధవారం తెల్లవారుజామున ఈ దృశ్యం కనిపించింది. అప్రమత్తమైన ఫారెస్టు అధికారులు చిరుతను బంధించేందుకు బోన్లను ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్‌ చిరుత ద్వారా అలిపిరి నడకమార్గం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఆరు చిరుత పులులు చిక్కాయి.