Oct 09,2023 15:39

ప్రజాశక్తి-విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురయింది. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అదేవిధంగా సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పొడిగింపు పిటిషన్‌ను కూడా కోర్టు డిస్మిస్‌ చేసింది. ప్రస్తుతం చంద్రబాబుపై దాఖలైన పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభమైంది. మరోవైపు స్కిల్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఎలాంటి తీర్పు వెలువడనుందో అనే ఉత్కంఠ నెలకొంది.