Feb 19,2023 21:52

వన్డే జట్టులో జడేజాకు చోటు
3, 4 టెస్టులకు, వన్డే సిరీస్‌కు జట్లను ప్రకటించిన బిసిసిఐ

ముంబయి: తొలి రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన కేఎల్‌ రాహుల్‌పై బిసిసిఐ నమ్మకముంచింది. ఆస్ట్రేలియాతో జరిగే మూడు, నాలుగు టెస్టులకు కేఎల్‌ రాహుల్‌కు చోటు కల్పించింది. బోర్డర్‌గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో భారత్‌ గెలిచి 2ా0 ఆధిక్యతలో ఉండగా.. మిగిలిన రెండు టెస్టులు ఇండోర్‌, అహ్మదాబాద్‌ వేదికలు వచ్చే నెలలో జరగనున్నాయి. మూడో టెస్ట్‌ మార్చి 1నుంచి, ప్రారంభం కానుండగా.. రంజీట్రోఫీ టైటిల్‌ను నెగ్గిన సౌరాష్ట్ర కెప్టెన్‌ జయదేవ్‌ ఉనాద్కట్‌ మూడో టెస్ట్‌కు జట్టుకు అందుబాటులోకి రానున్నాడు. ఇక మూడు వన్డేల సిరీస్‌ 17నుంచి ప్రారంభం కానుంది.
మూడు, నాలుగు టెస్టులకు జట్టు..
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, పుజారా, కోహ్లి, శ్రీకర్‌ భరత్‌, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, అక్షర్‌, కుల్దీప్‌, జడేజా, షమీ, సిరాజ్‌, శ్రేయస్‌, సూర్యకుమార్‌, ఉమేశ్‌, ఉనాద్కట్‌.
వన్డే సిరీస్‌కు జట్టు..
రోహిత్‌(కెప్టెన్‌), శుభ్‌మన్‌, కోహ్లి, శ్రేయస్‌, సూర్యకుమార్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌(వైస్‌ కెప్టెన్‌), జడేజా, కుల్దీప్‌, సుందర్‌, చాహల్‌, షమీ, సిరాజ్‌, ఉమ్రన్‌ మాలిక్‌, శార్దూల్‌, అక్షర్‌, ఉనాద్కట్‌.
17 : తొలి వన్డే(ముంబయి)
19 : రెండో వన్డే(విశాఖ)
22 : మూడో వన్డే(చెన్నై)