Mar 20,2023 08:29

గూడూరు (నెల్లూరు) : జీవో నెంబర్‌ 1 కి వ్యతిరేకంగా, అంగన్వాడి సమస్యలపై వామపక్ష పార్టీలు, సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు నేడు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ నిరసనకు అనుమతి లేదంటూ... గూడూరు మండలం ఇంద్రసేనా రెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి మారుబోయిన రాజా, సిపిఎం మండల కార్యదర్శి వేగూరు వెంకయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కాల్తి రెడ్డి రవణమ్మ, పచ్చ మధుకు నోటీసులిచ్చారు. ఈ సందర్భంగా వేగూరు వెంకయ్య, రాజా లు మాట్లాడుతూ ... రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై ఉక్కు పాదం మోపడం కోసం ఇలా పోలీసులతో నోటీసులు ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూసి కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రజా ఉద్యమ అణచివేత చర్యలు మానుకోవాలని ఇలాంటి అక్రమ నోటీసులతో ప్రజా, కార్మిక, ఉద్యమాలను ఆపలేరని ఉద్ఘాటించారు.

గండేపల్లి (కాకినాడ) : అంగన్వాడీలను చలో విజయవాడ కార్యక్రమాఁకి వెళ్ళనీయకఁండా పోలీసులు అడ్డగించారు. గండేపల్లి మండలం పోలీస్‌ స్టేషన్‌ వద్ద అంగన్వాడీలు ధర్నా కొనసాగిస్తున్నారు.