వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా గురువారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ షాయ్ హౌప్ (129 బంతుల్లో 132 - 10 ఫోర్లు, 3 సిక్సర్లు), నికోలస్ పూరన్ (94 బంతుల్లో 115 - 10 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాన్ని బాదాడు. బ్రాండన్ కింగ్ (32), రోవ్‌మాన్ పావెల్ (29) పరుగులు చేయగా జాసన్ హౌల్డర్ (16), కీమో పాల్ 1, కైల్ మేయర్స్ 1, జాన్సన్ చార్లెస్ (0), నిరాశపరిచారు. నేపాల్ బౌలర్లలో లలిత్ రాజ్‌బంశీ 3.. కరణ్, గుల్షన్ ఝా, సందీప్ లామిచ్చేన్, దీపేంద్ర సింగ్ తలో వికెట్ పడగొట్టారు.










