Jul 14,2023 08:48
  • భారత్‌ 245/2

డొమినిక : వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలిటెస్ట్‌లో టెస్టు అరంగేట్రం ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌తోపాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెంచరీలతో కదం తొక్కారు. భారతజట్టు రెండోరోజు టీ విరామ సమయానికి 81ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఆ సమయా నికి క్రీజ్‌లో జైస్వాల్‌(116నాటౌట్‌), కోహ్లి(4నాటౌ ట్‌) ఉన్నారు. గురువారం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్లు 229 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్‌ శర్మ(103) అథనంజే బౌలింగ్‌లో డీ-శిల్వకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ, యశస్వీ జైస్వాల్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టెస్ట్‌ క్రికెట్‌లో 17 ఏళ్ల తర్వాత వెస్టిండీస్‌ గడ్డపై 100 పరుగుల నమోదు చేశారు. శుభ్‌మన్‌(6) నిరాశపరి చాడు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ జట్టు 150పరుగు లకే ఆలౌటైంది.
 

                                                                  అరంగేట్రం టెస్ట్‌లోనే యశస్వి..

అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన 17వ భారత బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్‌ రికార్డు సష్టించాడు. పదేళ్ల తర్వాత తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన రెండో ఎడమచేతివాటం బ్యాటర్‌గా, ఓపెనర్‌గా తొలి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా జైస్వాల్‌ నిలిచాడు. టీమిండియా తరఫున సుదీర్ఘ ఫార్మాట్‌లో అతి తక్కువ వయసులో (21 ఏళ్ల 196 రోజులు) సెంచరీ బాదిన నాలుగో ఆటగాడిగా జైస్వాల్‌ రికార్డు సష్టించాడు. ఈ జాబితాలో పథ్వీ షా (18 ఏళ్ల 329 రోజులు), అబ్బాస్‌ అలీ (20 ఏళ్ల 126 రోజులు), గుండప్ప విశ్వనాథ్‌ (20 ఏళ్ల 276 రోజులు) యశస్వి కంటే ముందున్నారు.