కాల్గరీ: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ సంచలనం సృష్టించాడు. కెనడా ఓపెన్ సూపర్-500 టైటిల్‌ను కైవసం చేసుకొని ఈ టైటిల్‌ను చేజిక్కించుకున్న తొలి భారత షట్లర్‌గా రికార్డు నెలకొల్పాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షి ఫెంగ్(చైనా)ను చిత్తు చేసి విజేతగా నిలిచాడు. తొలి గేమ్ ఆరంభం నుంచే అద్భుతమైన ఆటతో లక్ష్యసేన్ ప్రత్యర్థిని షాక్‌కు గురి చేశాడు. వరుస సెట్లలో జోరు కొనసాగించి 21-18, 22-20తో గెలుపొందాడు. ఈ సీజన్‌లో లక్ష్యసేన్‌కు ఇదే తొలి వరల్డ్ టూర్ టైటిల్. మొత్తమ్మీద రెండో బిడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టైటిల్. నిరుడు జనవరిలో లక్ష్యసేన్ ఇండియా ఓపెన్ విజేతగా నిలిచాడు. టైటిల్ గెలిచిన అనంతరం లక్ష్యసేన్ మాట్లాడుతూ.. 'ఈ ఏడాది ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని అనుకున్నా.. కానీ పరిస్థితులు కలిసి రాలేదు. కెనడా ఓపెన్ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కొన్ని మ్యాచుల్లో ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చింది. పరిస్థితులు కష్టంగా ఉండేవి. అయితే.. సమయానికి తగ్గట్టు ఆడడం అనేది చాలా ముఖ్యం. కెనడా ఓపెన్‌లో అదే చేశాను' అని తెలిపాడు. లక్ష్యసేన్ ప్రస్తుతం 19వ ర్యాంక్‌లో ఉన్నాడు.
- 11వ సీడ్‌కు షాక్ ఇచ్చి..
కెనడా ఓపెన్‌లో టైటిల్ నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగిన లక్ష్యసేన్ అంచనాలకు మించి రాణించాడు. సెమీఫైనల్లో 11వ సీడ్ కెంట నిషిమొటో(జపాన్)ను చిత్తు చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. దాంతో, రెండోసారి బిడబ్ల్యూఎఫ్ సూపర్ణ్-500 టైటిల్ ఫైనల్లో అడుగుపెట్టాడు. 44 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ నిషిమొటోపై ఆధిపత్యం చెలాయించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 21-17, 21-14తో గెలుపొందాడు.










