ధర రూ.12.85 లక్షలు
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి తన మిడ్ సైజ్ ఎస్‌యువి గ్రాండ్ విటారాలో ఎస్‌ాసిఎన్‌జి వర్షన్‌ను విడుదల చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. డెల్టా, జీటా వేరియంట్లలో లభించే వీటి ఎక్స్‌షోరూం ధరలను వరుసగా రూ.12.85 లక్షలు, రూ.18.84 లక్షలుగా నిర్ణయించింది. 1.5 లీటర్ ఇంజిన్ కలిగిన ఈ ఎస్‌యువి 6,000 ఆర్‌పిఎం వద్ద 99 బిహెచ్‌పి శక్తిని కలిగి ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది. మారుతి సుజుకి సిఎన్‌జి వర్షన్‌లలో ఇది 14వ మోడల్.










