Dec 24,2022 21:20

న్యూఢిల్లీ : వీడియోకాన్‌కు రుణాలు ఇవ్వడం ద్వారా క్విడ్‌ప్రోకోకు పాల్పడిన కేసులో ఐసిఐసిఐ బ్యాంక్‌ మాజీ సిఇఒ, ఎండి చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లను సిబిఐ కస్టడీకి తీసుకుంది. వారిని మూడు రోజుల పాటు అంటే డిసెంబర్‌ 26 వరకు సిబిఐ కస్టడీకి అవకాశం ఇస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం వీరిని సిబిఐ అధికారులు అరెస్ట్‌ చేసి.. ముంబయి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పర్చారు. కొచ్చర్‌ దంపతులు తమ దర్యాప్తునకు సహకరించడం లేదని సిబిఐ ఆరోపిస్తోంది.